×

الشورى

ఆయత్ 52

అల్-ముఖ్తసర్

وَكَذَٰلِكَ أَوْحَيْنَآ إِلَيْكَ رُوحًا مِّنْ أَمْرِنَا ۚ مَا كُنتَ تَدْرِى مَا ٱلْكِتَـٰبُ وَلَا ٱلْإِيمَـٰنُ وَلَـٰكِن جَعَلْنَـٰهُ نُورًا نَّهْدِى بِهِۦ مَن نَّشَآءُ مِنْ عِبَادِنَا ۚ وَإِنَّكَ لَتَهْدِىٓ إِلَىٰ صِرَٰطٍ مُّسْتَقِيمٍ ﴿٥٢﴾

మరియు మేము ప్రవక్తా మీకన్న మునుపు ప్రవక్తలకు దైవవాణిని చేరవిసినట్లే మేము మీకు ఖుర్ఆన్ ను మా వద్ద నుండి దైవవాణి ద్వారా చేరవేశాము. దానికన్న ముందు దైవ ప్రవక్తలపై అవతరింపబడిన దివ్యగ్రంధములేమిటో మీకు తెలియదు. మరియు విశ్వాసమంటే ఏమిటో మీకు తెలియదు ?. కాని మేము ఈ ఖుర్ఆన్ ను జ్యోతిగా అవతరింపజేసి దాని ద్వారా మా దాసుల్లోంచి మేము కోరిన వారికి సన్మార్గంపై తీసుకుని వస్తాము. మరియు నిశ్ఛయంగా మీరు ప్రజలను సన్మార్గమును చూపుతారు. అదే ఇస్లాం.