×

الشورى

ఆయత్ 29

అల్-ముఖ్తసర్

وَمِنْ ءَايَـٰتِهِۦ خَلْقُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَثَّ فِيهِمَا مِن دَآبَّةٍ ۚ وَهُوَ عَلَىٰ جَمْعِهِمْ إِذَا يَشَآءُ قَدِيرٌ ﴿٢٩﴾

ఆకాశములను సృష్టించటం,భూమిని సృష్టించటం మరియు ఆ రెండింటిలో విచిత్రమైన జీవరాసులను వ్యాపింపజేయటం అల్లాహ్ సామర్ధ్యంపై,ఆయన ఏకత్వం పై సూచించే సూచనలు. మరియు ఆయన హషర్ (సమీకరించటం),ప్రతిఫలం ప్రసాదించటం కొరకు వారందరిని సమావేశపరచటంపై తాను తలచుకున్నప్పుడు సామర్ధ్యం కలవాడు. వాటిని మొదటిసారి సృష్టించటం ఆయనను అశక్తుడిని చేయనట్లుగానే అది ఆయనను అశక్తుడిని చేయదు.