×

النساء

ఆయత్ 81

అల్-ముఖ్తసర్

وَيَقُولُونَ طَاعَةٌ فَإِذَا بَرَزُوا۟ مِنْ عِندِكَ بَيَّتَ طَآئِفَةٌ مِّنْهُمْ غَيْرَ ٱلَّذِى تَقُولُ ۖ وَٱللَّهُ يَكْتُبُ مَا يُبَيِّتُونَ ۖ فَأَعْرِضْ عَنْهُمْ وَتَوَكَّلْ عَلَى ٱللَّهِ ۚ وَكَفَىٰ بِٱللَّهِ وَكِيلًا ﴿٨١﴾

మరియు కపటులు తమ నాలుకలతో మీతో ఇలా పలుకుతారు : మేము మీ ఆదేశముపై విధేయత చూపుతాము మరియు దానికి కట్టుబడి ఉంటాము. వారు మీ వద్ద నుండి వెళ్ళిపోయినప్పుడు వారిలోని ఒక వర్గము మీకు బహిర్గతం చేసిన దానికి వ్యతిరేకంగా గోప్యంగా కుట్రలు పన్నుతుంది. వారు పన్నే కుట్రల గురించి అల్లాహ్ కు తెలుసు. మరియు తొందరలోనే ఆయన వారి ఈ కుట్రపై వారికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు. అయితే మీరు వారిని పట్టించుకోకండి. వారు మీకు ఎటువంటి హాని తలపెట్టలేరు. మరియు మీరు మీ వ్యవహారమును అల్లాహ్ కు అప్పజెప్పండి. మరియు ఆయన పై నమ్మకమును కలిగి ఉండండి. మీరు నమ్మకమును కలిగి ఉన్న అల్లాహ్ కార్యసాధకుడిగా చాలు.