×

النساء

ఆయత్ 147

అల్-ముఖ్తసర్

مَّا يَفْعَلُ ٱللَّهُ بِعَذَابِكُمْ إِن شَكَرْتُمْ وَءَامَنتُمْ ۚ وَكَانَ ٱللَّهُ شَاكِرًا عَلِيمًا ﴿١٤٧﴾

ఒక వేళ మీరు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుని ఆయనపై విశ్వాసమును కనబరిస్తే మిమ్మల్ని శిక్షించే అవసరం ఆయనకు లేదు. ఆయన మహోన్నతుడు, మంచిగా వ్యవహరించేవాడు,కరుణించేవాడు. మరియు ఆయన మీ పాపములపై మాత్రమే మిమ్మల్ని శిక్షిస్తాడు. ఒక వేళ మీరు ఆచరణను సంస్కరించుకుంటే మరియు ఆయన అనుగ్రహములపై ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుని బాహ్యంగా మరియు అంతరంగంగా ఆయనపై విశ్వాసమును కనబరచి ఉంటే ఆయన మిమ్మల్ని శిక్షించడు. మరియు అల్లాహ్ తన అనుగ్రహాలను అంగీకరించే వారి కొరకు ఆదరించి దానిపై వారికి అధికముగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. తన సృష్టితాల విశ్వాసమును గురించి బాగా తెలిసినవాడు. మరియు ఆయన తొందరలోనే ప్రతి ఒక్కరికి వారి కర్మల పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.