×

النساء

ఆయత్ 141

అల్-ముఖ్తసర్

ٱلَّذِينَ يَتَرَبَّصُونَ بِكُمْ فَإِن كَانَ لَكُمْ فَتْحٌ مِّنَ ٱللَّهِ قَالُوٓا۟ أَلَمْ نَكُن مَّعَكُمْ وَإِن كَانَ لِلْكَـٰفِرِينَ نَصِيبٌ قَالُوٓا۟ أَلَمْ نَسْتَحْوِذْ عَلَيْكُمْ وَنَمْنَعْكُم مِّنَ ٱلْمُؤْمِنِينَ ۚ فَٱللَّهُ يَحْكُمُ بَيْنَكُمْ يَوْمَ ٱلْقِيَـٰمَةِ ۗ وَلَن يَجْعَلَ ٱللَّهُ لِلْكَـٰفِرِينَ عَلَى ٱلْمُؤْمِنِينَ سَبِيلًا ﴿١٤١﴾

మీకు సంభవించే మేలు లేదా చెడు గురించి నిరీక్షించే వారు ఒక వేళ మీకు అల్లాహ్ వద్ద నుండి విజయం కలిగి మీరు విజయ ప్రాప్తిని పొందితే వారు మీతో ఇలా పలుకుతారు : ఏమీ మీరు హాజరు అయిన చోట మేము మీతో పాటు హాజరు కాలేదా ? వారు విజయ ప్రాప్తిని పొందటానికి. ఒక వేళ అవిశ్వాసపరులకు అదృష్టం వరిస్తే వారు వారితో ఇలా పలుకుతారు : మేము మీ వ్యవహారములను జాగ్రత్తగా చూసుకోలేదా మరియు సంరక్షణ,మద్దతుతో మిమ్మల్ని సంరక్షించలేదా మరియు మేము మీకు సహాయము చేసి విశ్వాసపరులను పరాభవమునకు గురి చేసి మిమ్మల్ని విశ్వాసపరుల నుండి రక్షించలేదా ?! అయితే అల్లాహ్ ప్రళయదినమున మీ అందరి మధ్య తీర్పునిస్తాడు. అప్పుడు ఆయన విశ్వాసపరులను స్వర్గములో ప్రవేశింపజేసి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. మరియు కపటులకు నరకములో క్రిందటి స్థానములో ప్రవేశింపజేసి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ ప్రళయదినమున అవిశ్వాసపరులకు తన అనుగ్రహమును ప్రసాదించి విశ్వాసపరులకు వ్యతిరేకంగా వాదన చేయడు. కాని విశ్వాసపరులకు వారు సత్యవిశ్వాసముతో ధర్మబద్ధంగా ఆచరించే వరకు మంచి పర్యవాసనమును కలిగిస్తాడు.