అల్-ముఖ్తసర్
وَٱتَّقُوا۟ يَوْمًا لَّا تَجْزِى نَفْسٌ عَن نَّفْسٍ شَيْـًٔا وَلَا يُقْبَلُ مِنْهَا شَفَـٰعَةٌ وَلَا يُؤْخَذُ مِنْهَا عَدْلٌ وَلَا هُمْ يُنصَرُونَ ﴿٤٨﴾
మరియు మీరు మీ విధులను నిర్వర్తించి మీకు నిషేదించిన వాటి నుండి దూరంగా ఉండటం ద్వారా మీకూ మరియు ప్రళయదినం నాటి దైవశిక్షకు మధ్య రక్షణను ఏర్పరచుకోండి.ఆ రోజు ఎవరూ ఎవరికి ప్రయోజనాన్ని చేకూర్చలేరు.మరియు ఏ ఆపద నుంచి తొలగించడానికైనా ఏ మేలును చేకూర్చడానికైనా అల్లాహ్ అనుమతి లేనిదే ఎవరి సిఫారసు స్వికరించబడదు.మరియు భూమి నిండా బంగారాన్ని పరిహారంగా చెల్లించినా తీసుకోబడదు.మరియు ఆరోజు రక్షించేవారెవ్వరూ ఉండరు.అలాంటప్పుడు సిఫారసుదారుల సిఫారసు, పరిహారం లాభం చేకూర్చలేవు మరియు రక్షించేవారెవరూ ఉండరు కనుక అప్పుడు ఎక్కడికి పారిపోవాలి?