×

البقرة

ఆయత్ 30

అల్-ముఖ్తసర్

وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَـٰٓئِكَةِ إِنِّى جَاعِلٌ فِى ٱلْأَرْضِ خَلِيفَةً ۖ قَالُوٓا۟ أَتَجْعَلُ فِيهَا مَن يُفْسِدُ فِيهَا وَيَسْفِكُ ٱلدِّمَآءَ وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ ۖ قَالَ إِنِّىٓ أَعْلَمُ مَا لَا تَعْلَمُونَ ﴿٣٠﴾

అల్లాహ్ సుబ్హానహు వతఆలా తాను దైవదూతలతో మాట్లాడిన సన్నివేశాన్ని తెలియజేస్తూ ఇలా అన్నాడు:నిస్సందేహంగా ఆయన భువిలో ఒకరికొకరు ప్రాతినిధ్యం వహించుచు దైవవిధేయతను (ధర్మాన్ని) స్ధాపించేందుకు మానవుణ్ని సృష్టించబోతున్నాను.అని అన్నాడు అప్పుడు దైవదూతలు విశ్లేషణ మరియు మార్గదర్శకాన్ని పొందే ఉద్దేశ్యంతో మానవుణ్ని భూమిపై ప్రతినిధిగా పంపటం వెనుక మర్మమేమిటని ప్రశ్నించారు.వారు అందులో కల్లోలాన్ని వ్యాపింపజేస్తారు మరియు దౌర్జన్యంతో నెత్తురును చిందిస్తారు(అని అభ్యర్ధించారు) మరియు మేము నీ విధేయతకు కట్టుబడి ఉండేవాళ్లం నీ పవిత్రతను కొనియాడేవాళ్లం,నీ ఘనతను చాటేవాళ్లము.మరియు వీటి నంచి అలసిపోయే వాళ్లము కాదు కదా అని అన్నారు.అప్పుడు అల్లాహ్ వారి ప్రశ్నకు సమాధానంగా:నిస్సందేహంగా మానవుని సృష్టి వెనుక మీకు తెలియని పరమార్ధాన్ని మరియు వారి ప్రాతినిధ్యం యొక్క లక్ష్యాన్ని నేను తెలిసినవాడను.