అల్-ముఖ్తసర్
كَانَ ٱلنَّاسُ أُمَّةً وَٰحِدَةً فَبَعَثَ ٱللَّهُ ٱلنَّبِيِّـۧنَ مُبَشِّرِينَ وَمُنذِرِينَ وَأَنزَلَ مَعَهُمُ ٱلْكِتَـٰبَ بِٱلْحَقِّ لِيَحْكُمَ بَيْنَ ٱلنَّاسِ فِيمَا ٱخْتَلَفُوا۟ فِيهِ ۚ وَمَا ٱخْتَلَفَ فِيهِ إِلَّا ٱلَّذِينَ أُوتُوهُ مِنۢ بَعْدِ مَا جَآءَتْهُمُ ٱلْبَيِّنَـٰتُ بَغْيًۢا بَيْنَهُمْ ۖ فَهَدَى ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُوا۟ لِمَا ٱخْتَلَفُوا۟ فِيهِ مِنَ ٱلْحَقِّ بِإِذْنِهِۦ ۗ وَٱللَّهُ يَهْدِى مَن يَشَآءُ إِلَىٰ صِرَٰطٍ مُّسْتَقِيمٍ ﴿٢١٣﴾
పూర్వం ప్రజలందరు ఒకే సమాజంగా సన్మార్గం పై తమ తండ్రి ఆదమ్ ధర్మం పై ఉండేవారు. చివరికి షైతానులు వారిని మార్గభ్రష్టతకు గురి చేసారు. విశ్వాసపరునికి,అవిశ్వాసపరునికి మధ్య విభేదించుకున్నారు. అందువలనే అల్లాహ్ విధేయులైన విశ్వాసపరుల కొరకు ఏర్పాటు చేసిన తన కారుణ్యం గురించి వారికి శుభవార్తనిస్తూ,అవిశ్వాసపరుల కొరకు తాను తయారు చేసిన తన కఠిన శిక్షను గురించి వారికి హెచ్చరిస్తూ దైవ ప్రవక్తలను పంపించాడు. ప్రజలు దేని గురించి విభేదించుకున్నారో దాని గురించి ప్రజల్లో తీర్పునివ్వటం కొరకు ఎటువంటి సందేహం లేని సత్యంతో కూడుకుని ఉన్న గ్రంధాలను తన ప్రవక్తలతో పాటు అవతరింపచేశాడు. అది అల్లాహ్ వద్ద నుండి వచ్చిన సత్యమని అల్లాహ్ వాదనలు యూదుల వద్దకు వచ్చిన తరువాత వారు తౌరాత్ జ్ఞానమును ఇవ్వబడిన తరువాత తమ దుర్మార్గం వలన దాని విషయంలో విభేదించుకున్నారు. అందులో విభేదించుకోవటానికి ఎటువంటి ఆస్కారమూ లేదు. అల్లాహ్ మార్గభ్రష్టత నుండి సన్మార్గమును పొందే జ్ఞానమును తన అనుమతితో,తన నిర్ణయంతో విశ్వాసపరులకు సౌభాగ్యమును కలిగించాడు. అల్లాహ్ తాను కోరిన వారికి ఎటువంటి వంకరతనం లేని సన్మార్గమును ప్రసాదిస్తాడు. అదే విశ్వాసము యొక్క మార్గము.