×

البقرة

ఆయత్ 171

అల్-ముఖ్తసర్

وَمَثَلُ ٱلَّذِينَ كَفَرُوا۟ كَمَثَلِ ٱلَّذِى يَنْعِقُ بِمَا لَا يَسْمَعُ إِلَّا دُعَآءً وَنِدَآءً ۚ صُمٌّۢ بُكْمٌ عُمْىٌ فَهُمْ لَا يَعْقِلُونَ ﴿١٧١﴾

తాతముత్తాతలను అనుసరించటంలో సత్యతిరస్కారుల ఉపమానము ఆ కాపరిలా ఉన్నది,అతడు తన పశువులను పిలుస్తూ అరుస్తాడు,అవి అతని గొంతును వింటాయి,కాని అతని మాటను అర్దం చేసుకోలేవు,వారు సత్యమును లబ్ది పొందే విధంగా వినటంలో చెవిటివారు,వారు మూగవారు,వారి నాలుకలు సత్యాన్ని మాట్లాడటంలో మూగబోయినవి,దాన్ని (సత్యంను) చూడటంలో వారు అంధులు,అందుకనే ఏ సత్యం వైపునకు మీరు వారిని పిలుస్తున్నారో దానిని వారు అర్ధం చేసుకోలేరు.