అల్-ముఖ్తసర్
سَيَقُولُ ٱلسُّفَهَآءُ مِنَ ٱلنَّاسِ مَا وَلَّىٰهُمْ عَن قِبْلَتِهِمُ ٱلَّتِى كَانُوا۟ عَلَيْهَا ۚ قُل لِّلَّهِ ٱلْمَشْرِقُ وَٱلْمَغْرِبُ ۚ يَهْدِى مَن يَشَآءُ إِلَىٰ صِرَٰطٍ مُّسْتَقِيمٍ ﴿١٤٢﴾
యూదుల్లోంచి అజ్ఞానులు,మంద బుద్ధి కలవారు,వారి విధానం పై ఉన్న కపటులు తొందరలోనే అంటారు : ముందు నుంచి ముస్లిముల ఖిబ్లాగా ఉన్న బైతుల్ మఖ్దిస్ ను వారి ఖిబ్లా దిశ నుంచి ఏది మార్చింది?! ఓ ప్రవక్త వారికి సమాధానమిస్తూ ఇలా పలకండి : తూర్పు పడమరలు,అవే కాకుండ ఇతర దిశలు ఒక్కడైన అల్లాహ్ యాజమాన్యంలో ఉన్నవి,తాను తన దాసుల్లోంచి ఏ దిశ వైపు కోరుకుంటే ఆ దిశ వైపునకు మరలుస్తాడు,అతడు పరుశుద్ధుడు తన దాసుల్లోంచి ఎవరిని తలుచుకుంటే వారిని ఎటువంటి వంకరతనము,మలుపు లేని సన్మార్గము చూపుతాడు.