×

البقرة

ఆయత్ 133

అల్-ముఖ్తసర్

أَمْ كُنتُمْ شُهَدَآءَ إِذْ حَضَرَ يَعْقُوبَ ٱلْمَوْتُ إِذْ قَالَ لِبَنِيهِ مَا تَعْبُدُونَ مِنۢ بَعْدِى قَالُوا۟ نَعْبُدُ إِلَـٰهَكَ وَإِلَـٰهَ ءَابَآئِكَ إِبْرَٰهِـۧمَ وَإِسْمَـٰعِيلَ وَإِسْحَـٰقَ إِلَـٰهًا وَٰحِدًا وَنَحْنُ لَهُۥ مُسْلِمُونَ ﴿١٣٣﴾

యాకూబ్ కు మరణం ఆసన్నమయినప్పుడు మీరు అక్కడ ఉన్నారా? అప్పుడు ఆయన తన కుమారులను ప్రశ్నిస్తూ ఈ విధంగా పలికారు : నా మరణాంతరం మీరు ఎవరిని ఆరాధిస్తారు? వారు ఆయన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇలా పలికారు : మేము మీ ఆరాధ్య దైవమును, మీ పూర్వికులైన ఇబ్రాహీం ఇస్మాయీల్,ఇస్హాఖ్ ల ఆరాధ్యదైవమైన ఒకే ఆరాధ్య దైవమును మాత్రమే ఆరాధిస్తాము.ఆయనకు ఎవరూ సాటి లేరు.మరియు మేము ఆయన ఒక్కడికే విధేయులమై కట్టుబడి ఉంటాము.