×

البقرة

ఆయత్ 102

అల్-ముఖ్తసర్

وَٱتَّبَعُوا۟ مَا تَتْلُوا۟ ٱلشَّيَـٰطِينُ عَلَىٰ مُلْكِ سُلَيْمَـٰنَ ۖ وَمَا كَفَرَ سُلَيْمَـٰنُ وَلَـٰكِنَّ ٱلشَّيَـٰطِينَ كَفَرُوا۟ يُعَلِّمُونَ ٱلنَّاسَ ٱلسِّحْرَ وَمَآ أُنزِلَ عَلَى ٱلْمَلَكَيْنِ بِبَابِلَ هَـٰرُوتَ وَمَـٰرُوتَ ۚ وَمَا يُعَلِّمَانِ مِنْ أَحَدٍ حَتَّىٰ يَقُولَآ إِنَّمَا نَحْنُ فِتْنَةٌ فَلَا تَكْفُرْ ۖ فَيَتَعَلَّمُونَ مِنْهُمَا مَا يُفَرِّقُونَ بِهِۦ بَيْنَ ٱلْمَرْءِ وَزَوْجِهِۦ ۚ وَمَا هُم بِضَآرِّينَ بِهِۦ مِنْ أَحَدٍ إِلَّا بِإِذْنِ ٱللَّهِ ۚ وَيَتَعَلَّمُونَ مَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ ۚ وَلَقَدْ عَلِمُوا۟ لَمَنِ ٱشْتَرَىٰهُ مَا لَهُۥ فِى ٱلْـَٔاخِرَةِ مِنْ خَلَـٰقٍ ۚ وَلَبِئْسَ مَا شَرَوْا۟ بِهِۦٓ أَنفُسَهُمْ ۚ لَوْ كَانُوا۟ يَعْلَمُونَ ﴿١٠٢﴾

మరియు ఎప్పుడైతే వారు అల్లాహ్ ధర్మమును వదిలివేశారో వారు దానికి బదులుగా అల్లాహ్ ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాం రాజ్యం విషయంలో షైతానులు కల్పించుకున్న అబద్దమును అనుసరించారు. ఎందుకంటే ఆయన తన రాజ్యమును మంత్రజాలముతో స్థాపించారని వారు వాదించారు. సులైమాన్ అలైహిస్సలాం మంత్రజాలమును ఉపయోగించి అవిశ్వాసమునకు పాల్పడలేదు. ఏ విధంగానైతే యూదులు వాదించేవారో. కానీ షైతానులు అవిశ్వాసమును కనబరచారు ఎందుకంటే వారు ప్రజలకు మంత్రజాలమును నేర్పించేవారు. ఇరాక్ లోని బాబిల్ పట్టణంలోని ఇద్దరు దైవదూతలైన హారూత్ మరియు మారూత్ పై ప్రజలకు పరీక్షగా అవతరింపబడే మంత్రజాలమును వారు వారికి నేర్పించేవారు. ఆ ఇద్దరు దూతలు ప్రతి ఒక్కరితో తమ మాటల్లో మేము ప్రజల కొరకు ఒక పరీక్ష కావున మీరు మంత్రజాలమును నేర్చుకుని అవిశ్వాసమునకు పాల్పడకండి అని హెచ్చరించిన తరువాతే నేర్పించేవారు. ఎవరైతే వారి హితోపదేశమును స్వీకరించలేదో వారు వారి నుండి మంత్రజాలమును నేర్చుకునేవారు. అందులో నుండి ఒక రకము మనిషికి అతని భార్యకు మధ్య వైరమును నాటి వారిద్దరి మధ్య వేరు చేసేది. ఈ మంత్రజాలకులందరు ఎవరికైనా నష్టం కలిగించిన అది అల్లాహ్ ఇచ్ఛతో,అనుమతితో మాత్రమే. వారు తమకు నష్టం కలిగించేది మరియు తమకు లాభం కలిగించని దాన్ని నేర్చుకుంటున్నారు. మరియు ఈ యూదులందరికి తెలుసు అల్లాహ్ గ్రంధమునకు బదులుగా మంత్రజాలమును ఎంచుకునే వాడికి పరలోకంలో ఎటువంటి వంతుగాని భాగము గాని లేదని. వారు దేనికి బదులుగా తమ ప్రాణములను అమ్మివేశారో అది ఎంతో చెడ్డది. ఎందుకంటే వారు అల్లాహ్ దివ్యవాణికి,ఆయన శాసనములకు బదులుగా మంత్రజాలమును ఎంచుకున్నారు. మరియు ఒక వేళ వారికి ప్రయోజనం కలిగించేది ఏదో వారికి తెలిసి ఉంటే ఈ అవమానకర చర్యకు,స్పష్టమైన మార్గ భ్రష్టతకు పాల్పడటానికి ముందడుగు వేసేవారు కాదు.