అల్-ముఖ్తసర్
وَإِذَآ أَنْعَمْنَا عَلَى ٱلْإِنسَـٰنِ أَعْرَضَ وَنَـَٔا بِجَانِبِهِۦ ۖ وَإِذَا مَسَّهُ ٱلشَّرُّ كَانَ يَـُٔوسًا ﴿٨٣﴾
మరియు మేము మానవునికి ఆరోగ్యము,ఐశ్వర్యము లాంటి అనుగ్రహాలను అనుగ్రహించినప్పుడు అతడు అల్లాహ్ కి కృతజ్ఞత తెలపటం నుండి,ఆయనకు విధేయత చూపటం నుండి విముఖత చూపుతాడు,అహంకారముతో దూరమవుతాడు. మరియు అతనికి అనారోగ్యము లేదా పేదరికం,అటువంటివి ఏవైన కలిగినప్పుడు అతడు అల్లాహ్ కారుణ్యము నుండి తీవ్రంగా నిరాశ,నిస్పృహలకు లోనవుతాడు.