అల్-ముఖ్తసర్
وَٱسْتَفْزِزْ مَنِ ٱسْتَطَعْتَ مِنْهُم بِصَوْتِكَ وَأَجْلِبْ عَلَيْهِم بِخَيْلِكَ وَرَجِلِكَ وَشَارِكْهُمْ فِى ٱلْأَمْوَٰلِ وَٱلْأَوْلَـٰدِ وَعِدْهُمْ ۚ وَمَا يَعِدُهُمُ ٱلشَّيْطَـٰنُ إِلَّا غُرُورًا ﴿٦٤﴾
నీవు వారిలోంచి ఎవరిని భ్రష్టు పట్టించగలవో వారిని పిలిచే నీ పాపిష్టి స్వరముతో భ్రష్టు పట్టించు. మరియు నీ విధేయత కొరకు పిలిచే నీ ఆశ్విక దళాలతో,పదాతి దళాలతో వారిపై పడు. మరియు నీవు వారి సంపదల్లో ప్రతీ ధర్మ విరుద్ధ ఖర్చులను అలంకరించటం ద్వారా వారికి భాగస్వామి అవ్వు,వారి సంతానము విషయంలో వారిని అబధ్ధములో దావా చేయటం ద్వారా,వారిని వ్యభిచారముతో పొందటం ద్వారా, వారిని పేరు పెట్టే సమయంలో అల్లాహేతరుల కొరకు వారి దాస్యమును అంటగట్టటం ద్వారా వారితో భాగస్వామ్యం అవ్వు. మరియు వారి కొరకు అబధ్ధపు వాగ్ధానాలను,అసత్యపు ఆశలను అలంకరించు.షైతాను వారిని కేవలం మోసానికి గురి చేసే అబధ్ధపు వాగ్ధానమును మాత్రమే చేస్తాడు.