అల్-ముఖ్తసర్
وَٱللَّهُ جَعَلَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَٰجًا وَجَعَلَ لَكُم مِّنْ أَزْوَٰجِكُم بَنِينَ وَحَفَدَةً وَرَزَقَكُم مِّنَ ٱلطَّيِّبَـٰتِ ۚ أَفَبِٱلْبَـٰطِلِ يُؤْمِنُونَ وَبِنِعْمَتِ ٱللَّهِ هُمْ يَكْفُرُونَ ﴿٧٢﴾
ఓ ప్రజలారా అల్లాహ్ మీలో నుండే మీకు సహవాసులను పుట్టించాడు వారితో మీరు మనశ్శాంతి పొందుతారు. మరియు ఆయన మీ భార్యల నుండి సంతానమును,సంతాన సంతానమును మీ కొరకు సృష్టించాడు. మరియు తినే ఆహారపదార్ధాలైన మాంసము,ధాన్యాలు,ఫలాలు వాటిలో ఉత్తమమైనవి లాంటివాటిని మీకు ప్రసాధించాడు. అలాంటప్పుడు మీరు అసత్యమైనటువంటి విగ్రహాలను,శిల్పాలను విశ్వసిస్తారా . మీరు లెక్క చేయలేనన్ని అనేకమైన అనుగ్రహాలను తిరస్కరిస్తారా,ఒక్కడైన అల్లాహ్ పై విశ్వాసమును కనబరచటం ద్వారా అల్లాహ్ కృతజ్ఞతను తెలుపుకోరా ?!.