అల్-ముఖ్తసర్
وَيَجْعَلُونَ لِلَّهِ ٱلْبَنَـٰتِ سُبْحَـٰنَهُۥ ۙ وَلَهُم مَّا يَشْتَهُونَ ﴿٥٧﴾
ముష్రికులు అల్లాహ్ కి కుమార్తెలను అంటగడుతున్నారు. మరియు వారిని దైవదూతలుగా విశ్వసిస్తున్నారు. వారు ఆయనకు సంతానమును అంటగడుతున్నారు. తమకు ఇష్టంలేని వాటిని ఆయన కొరకు ఎంచుకుంటున్నారు. వారిలో నుండి ఆయన కొరకు వారు అంటగడుతున్న వాటి నుండి ఆయన పరిశుద్ధుడు,పవితృడు.మరియు వారు తమ మనస్సులు కోరే మగ సంతానమును తమ కొరకు ఎంచుకొంటున్నారు. అయితే దీనికన్న మహా పాపం ఏమి ఉంటుంది?! .