×

النحل

ఆయత్ 36

అల్-ముఖ్తసర్

وَلَقَدْ بَعَثْنَا فِى كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ ٱعْبُدُوا۟ ٱللَّهَ وَٱجْتَنِبُوا۟ ٱلطَّـٰغُوتَ ۖ فَمِنْهُم مَّنْ هَدَى ٱللَّهُ وَمِنْهُم مَّنْ حَقَّتْ عَلَيْهِ ٱلضَّلَـٰلَةُ ۚ فَسِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَٱنظُرُوا۟ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلْمُكَذِّبِينَ ﴿٣٦﴾

మరియు నిశ్చయంగా మేము పూర్వపు ప్రతి జాతిలో ఒక ప్రవక్తను పంపించాము. అతను తన జాతి వారిని అల్లాహ్ ఒక్కడినే ఆరాధించమని,ఆయన కాక వేరే ఏవైన విగ్రహాల,షైతానుల,ఇతర వాటి ఆరాధన వదిలివేయమని ఆదేశించాడు. వారిలో నుండి అల్లాహ్ ఎవరికి అనుగ్రహించాడో వాడు అతన్ని విశ్వసించి,అతని ప్రవక్త తీసుకుని వచ్చిన దాన్ని అనుసరించే వాడు ఉన్నాడు.మరియు వారిలో నుండి అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,అతని ప్రవక్తపై అవిధేయత చూపినవాడు ఉన్నాడు. ఆయన అతనికి అనుగ్రహించలేదు. అప్పుడు అతనిపై మార్గభ్రష్టత అనివార్యమైపోయినది. అయితే మీరు తిరస్కారులపై శిక్ష,వినాశనము వచ్చిన తరువాత వారి పరిణామం ఏమయిందో చూడటానికి భూమిలో సంచరించండి.