అల్-ముఖ్తసర్
وَمَا ذَرَأَ لَكُمْ فِى ٱلْأَرْضِ مُخْتَلِفًا أَلْوَٰنُهُۥٓ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّقَوْمٍ يَذَّكَّرُونَ ﴿١٣﴾
పరిశుద్ధుడైన ఆయన భూమిలో సృష్టించిన రకరకాల రంగులు కల నిక్షేపాలను,జంతువులను,మొక్కలను,పంటలను మీకు వశపరచాడు. నిశ్చయంగా ఈ ప్రస్తావించబడిన సృష్టించటంలో,వశపరచటంలో పరిశుద్ధుడైన అల్లాహ్ సామర్ధ్యం పై దాని ద్వారా గుణపాటం నేర్చుకునే జాతి వారికి గొప్ప సూచన కలదు. మరియు వారు అల్లాహ్ సామర్ధ్యం కలవాడని,అనుగ్రహించేవాడని అర్ధం చేసుకుంటారు.