అల్-ముఖ్తసర్
ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ هَاجَرُوا۟ مِنۢ بَعْدِ مَا فُتِنُوا۟ ثُمَّ جَـٰهَدُوا۟ وَصَبَرُوٓا۟ إِنَّ رَبَّكَ مِنۢ بَعْدِهَا لَغَفُورٌ رَّحِيمٌ ﴿١١٠﴾
ఆ తరువాత ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ ప్రభువు ఆ బలహీన విశ్వాసపరులను క్షమించేవాడును,కరుణించేవాడును ఎవరైతే ముష్రికుల చేతుల్లో బాధించబడిన తరువాత మక్కా నుండి మదీనాకి హిజ్రత్ చేసి వెళ్లిపోయారో. వారు (ముష్రికులు) వారి ధర్మ విషయంలో పీడిస్తే వారు చివరకు వారి హృదయములు విశ్వాసముతో సంతృప్తి చెంది ఉండి, వారు అవిశ్వాసపలుకులు పలికారు,ఆ పిదప అల్లాహ్ వాక్కు గొప్పదవటానికి,అవిశ్వాసపరుల వాక్కు నేలమట్టం అవటానికి అల్లాహ్ మార్గంలో పోరాడి,దానిలో కలిగే కష్టాల్లో సహనం చూపించారు. నిశ్చయంగా నీ ప్రభువు వాడు పీడించబడిన ఈ పీడన తరువాత,వారు బాధించబడి చివరికి అవిశ్వాస పలుకును పలికిన బాధ తరువాత వారిని మన్నించే వాడును,వారిపై కనికరించే వాడును.ఎందుకంటే వారు అవిస్వాసపలుకులను బలవంతాన మాత్రమే పలికారు.