అల్-ముఖ్తసర్
وَلَقَدْ نَعْلَمُ أَنَّهُمْ يَقُولُونَ إِنَّمَا يُعَلِّمُهُۥ بَشَرٌ ۗ لِّسَانُ ٱلَّذِى يُلْحِدُونَ إِلَيْهِ أَعْجَمِىٌّ وَهَـٰذَا لِسَانٌ عَرَبِىٌّ مُّبِينٌ ﴿١٠٣﴾
మరియు ముష్రికులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఖుర్ఆన్ నేర్పిస్తున్నది ఒక మనిషి అని చెబుతున్న విషయం మాకు తెలుసు. వారు తమ వాదనలో అబధ్ధం చెబుతున్నారు. ఆయనకు నేర్పిస్తున్నాడని వారు వాదిస్తున్న వ్యక్తి భాష అరబీ కాదు (అజమీ). ఈ ఖుర్ఆన్ గొప్ప అర్ధము కల స్పష్టమైన అరబీ భాషలో అవతరింపబడినది. అలాంటప్పుడు ఆయన ఒక అరబేతరుడితో దాన్ని నేర్చుకున్నాడని మీరు ఎలా వాదిస్తున్నారు ?.