అల్-ముఖ్తసర్
وَبَرَزُوا۟ لِلَّهِ جَمِيعًا فَقَالَ ٱلضُّعَفَـٰٓؤُا۟ لِلَّذِينَ ٱسْتَكْبَرُوٓا۟ إِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ أَنتُم مُّغْنُونَ عَنَّا مِنْ عَذَابِ ٱللَّهِ مِن شَىْءٍ ۚ قَالُوا۟ لَوْ هَدَىٰنَا ٱللَّهُ لَهَدَيْنَـٰكُمْ ۖ سَوَآءٌ عَلَيْنَآ أَجَزِعْنَآ أَمْ صَبَرْنَا مَا لَنَا مِن مَّحِيصٍ ﴿٢١﴾
వాగ్ధానం చేయబడిన దినమున (ప్రళయదినాన) ప్రజలంతా తమ సమాదుల నుండి బయటకు వచ్చి అల్లాహ్ వైపునకు తరలి వెళుతారు. అప్పుడు బలహీనులైన అనుచరులు నాయకులతో,పెద్దవారితో ఇలా అంటారు : ఓ నాయకులారా నిశ్చయంగా మేము మీ ఆదేశాలను పాటించి,మీరు వారించిన వాటిని విడనాడి మిమ్మల్ని అనుసరించాము. అయితే మీరు అల్లాహ్ శిక్షను కొద్దిగైనా మా నుండి దూరం చేయగలరా ?. నాయకులు,పెద్దవారు ఇలా పలుకుతారు : ఒక వేళ అల్లాహ్ మాకు సన్మార్గమును ప్రసాధించి ఉంటే మేము మిమ్మల్ని దాని మార్గదర్శకం చేసేవారము. అప్పుడు మనమందరము అతని శిక్ష నుండి బ్రతికి బయటపడే వాళ్ళము. కాని మేము మార్గభ్రష్టులయ్యాము,మరియు మేము మిమ్మల్ని మార్గ భ్రష్టుల్ని చేశాము. మేము శిక్షను మోయటం నుండి బలహీన పడటం లేదా సహనం చూపటం మాపై మీపై ఒక్కటే. శిక్ష నుండి పారిపోయే ప్రదేశం ఏదీ మన కొరకు లేదు.