×

إبراهيم

ఆయత్ 18

అల్-ముఖ్తసర్

مَّثَلُ ٱلَّذِينَ كَفَرُوا۟ بِرَبِّهِمْ ۖ أَعْمَـٰلُهُمْ كَرَمَادٍ ٱشْتَدَّتْ بِهِ ٱلرِّيحُ فِى يَوْمٍ عَاصِفٍ ۖ لَّا يَقْدِرُونَ مِمَّا كَسَبُوا۟ عَلَىٰ شَىْءٍ ۚ ذَٰلِكَ هُوَ ٱلضَّلَـٰلُ ٱلْبَعِيدُ ﴿١٨﴾

అవిశ్వాసపరులు చేసే సత్కర్మలైన దానధర్మాలు,ఉపకారము,బలహీనులపట్ల దయలను ఆ బూడిదతో పోల్చవచ్చు దేనిపైనైతే తీవ్ర పెనుగాలులు వీచే దినమున పెనుగాలులు వీచి దాన్ని బలముతో ఎత్తుకుని వెళ్ళి దాని ఆనమాలు లేకుండా ఉండెంత వరకు ప్రతీ ప్రదేశములో చెల్లాచెదురుగా విసిరి వేస్తుంది. ఇలాగే అవిశ్వాసం అవిశ్వాసపరుల కర్మలపై వీస్తుంది. అప్పుడు ప్రళయదినాన ఆ కర్మలు చేసుకున్న వారికి అవి ప్రయోజనం చేకూర్చవు. ఆ కర్మల పునాది విశ్వాసము పై పెట్టలేదు,అది సత్యమార్గము నుండి దూరముగా తీసుకెళ్ళే అపమార్గము.